News December 1, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.
Similar News
News February 19, 2026
నార్సింగి: దారుణం.. గంజాయి తాగించి బాలికపై గ్యాంగ్ రేప్

నార్సింగి PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికకు ముగ్గురు రౌడీషీటర్లు బలవంతంగా గంజాయి తాగించారు. ఆపై మత్తులో తనపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిది నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీ అని సమాచారం.
News February 19, 2026
HYD: SMలో పోస్టులు పెట్టకపోతే బతికేదేమో..?

వనస్థలిపురంలో గర్భిణిని మాజీ భర్త చంపడానికి ప్రధాన కారణం SMలో పెట్టిన ఫొటోలేనా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. మహారాష్ట్రకు చెందిన సునీత, పెద్దపల్లివాసి మహేశ్ 2022లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2024లో విడిపోయారు. ఆపై HYDలో పరిచయమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనాథ్‌ను సునీత రెండో వివాహం చేసుకుని తానిప్పుడు హ్యాపీగా ఉన్నట్లు SMలో పోస్ట్ చేసింది. ఇదిచూసి రగిలిపోయిన మహేశ్ <<19175503>>మాజీ భార్యను నరికి చంపాడు.<<>>
News February 19, 2026
HYD: TG FSLలో జాబ్స్.. పరీక్షల తేదీలివే..!

TG ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5, 6, 7 తేదీలలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.


