News February 9, 2025
HYD: చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోసిన డాక్టర్ (PHOTO)

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణాలు పోసింది ఓ డాక్టర్. నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యశ్వంత్ అనే వ్యక్తి చనిపోయాడు. ఇదే యాక్సిడెంట్‌లో డా. నంగి భూమిక(24) తీవ్ర గాయాలపాలైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్‌దాన్ బృందం ఐదుగురు పేషంట్లకు ఆర్గాన్లు అవసరమని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. భూమిక గుండె, లీవర్, కళ్లు, కిడ్నీలను దానం చేసి ఐదుగురికి ప్రాణం పోశారు.
Similar News
News February 15, 2026
HYD: అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం!

అద్దెగాడిద కష్టం.. యజమాని ఇష్టం అన్న సామెత నగరంలో అద్దెకు ఉండేవారి పరిస్థితి సరిపోతుంది. ARV పేరుతో ప్రభుత్వం పన్నులు పెంచుతుంటే, ఆ భారాన్ని కిరాయిదారుల మీదకు నెడుతున్నారు. చట్టప్రకారం ‘రెంటల్ కంట్రోల్’ ఉన్నా, అది కేవలం పుస్తకాలకే పరిమితమైంది. ‘పన్ను పెరిగింది అద్దె పెంచుతున్నా’ అనే యజమానుల తీరుతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. అగ్రిమెంట్లు లేకపోవడంతో కిరాయిదారులకు కోర్టుకెళ్లే ధైర్యం లేకపోయింది.
News February 15, 2026
HYD: తొలి అడుగు 10th తర్వాతే!

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహించింది. సికింద్రాబాద్ ప్యారడైజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేశారు.
News February 15, 2026
హస్తం జోరు.. ఇక GHMC ఎన్నికలేనా?

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తాచాటడంతో జోష్‌లో ఉంది. ఇదే ఊపులో GHMC ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు కావటంతో పలు విషయాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేసే పనిలో పడింది. మే నెల చివరి కల్లా పాలకమండలి కొలువుదీరేలాగా సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో హస్తానికి మిశ్రమ ఫలితాలొచ్చాయి.


