News November 20, 2025
HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారు.
Similar News
News January 18, 2026
HYD: పట్నం వచ్చినా.. మదిలో మాత్రం పల్లె జ్ఞాపకాలే!

ఉపాధి కోసం HYD బాట పట్టిన జనం, పండుగ రాగానే ఊరువైపు పరుగులు పెడతారు. పట్నంలో పరుగు తీసిన కష్టాన్ని మరిచే ఆనందం, పండగకు పల్లెల్లోనే దొరుకుతుందని చెబుతుంటారు. అమ్మ వంట, నాన్న ఆశీర్వాదం, బంధువుల ఆప్యాయత ఇవన్నీ పండగకు ఊరే చిరునామా.. కాంక్రీట్ జంగల్ HYD జీవితంలోనూ పల్లె జ్ఞాపకాలే మనసుకు ఊరటనిస్తాయి. సంక్రాంతికి ఊరెళ్లి, మళ్లీ HYD బాట పట్టిన ప్రజలు ముచ్చటిస్తున్నారు.
News January 18, 2026
HYD: అందంగా ఉంటే సరిపోదు.. SKIP చేయకుంటేనే VIRAL..!

‘అందంగా ఉన్నంత మాత్రాన రీల్స్ వైరల్ కావు.. యూజర్ స్కిప్ చేయకుండా చూసినప్పుడే అల్గారిథమ్ గుర్తిస్తుంది’ అని క్రియేటర్‌వర్స్ ఫౌండర్ డా.మణి పవిత్ర పేర్కొన్నారు. FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్‌లో టూరిజం రీల్స్ బూట్ క్యాంప్ నిర్వహించారు. తెలంగాణ టూరిజంను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో జరిగిన ఈ శిక్షణలో 58 మంది పాల్గొన్నారు. FTCCI ప్రతినిధులు పాల్గొన్నారు.
News January 18, 2026
HYD: డాక్టర్ల చీటీ వాళ్లకే అర్థమవుతుంది.. ఎందుకు..?

డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ సామాన్యులకూ అర్థమయ్యేలా ఉండాలని NMC ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కాగా, డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ సిబ్బందికి సులువుగా అర్థమవుతుంది. ఇందుకు ప్రధాన కారణం వారి పని అనుభవమే. రోజూ వందలాది ప్రిస్క్రిప్షన్లు చూసే ఫార్మసిస్టులు డాక్టర్ల చేతిరాత, మందుల అబ్రివేషన్లు, ఫార్ములాలను ఈజీగా గుర్తిస్తారు. మందులపై అవగాహన ఉండటంతో చీటీ చూడగానే టక్కున మాత్రలు ఇచ్చేస్తారు.


