News November 19, 2025

HYD: చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం

image

కొంపల్లిలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి గుండ్లపోచంపల్లిలో చలిమంట వేసుకునే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. పెయింటర్లు నూర్ ఆలం(36), అశ్రఫ్ అలీ (27) ఇంటికి వెళ్లే సమయంలో చలిమంట వేసుకోగా వారి వద్ద మిగిలిన టర్పెంట్ ఆయిల్‌ని మంటలో వేశారు. దీంతో ఒక్కసారిగా మండి ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. వీరిద్దరూ బిహార్‌కు చెందిన వారు.

Similar News

News January 17, 2026

మరో రెండు అమృత్ భారత్ ట్రైన్లు

image

TG: తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి-నాగర్‌కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న PM మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.

News January 17, 2026

గ్రీన్‌లాండ్‌ విషయంలోనూ టారిఫ్ అస్త్రం

image

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో US అధ్యక్షుడు ట్రంప్ మరోసారి టారిఫ్ అస్త్రాన్ని ఉపయోగించనున్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. గతంలో టారిఫ్ బెదిరింపులతో యూరప్ దేశాలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే వ్యూహాన్ని గ్రీన్‌లాండ్ విషయంలోనూ అమలు చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

News January 17, 2026

అత్త యేలిన కోడలూ, చిత్త పట్టిన చేనూ

image

పూర్వకాలంలో, అత్త ఇంటి వ్యవహారాలను, కోడలి ప్రవర్తనను, పనులను దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఆ పర్యవేక్షణ, క్రమశిక్షణ వల్ల కోడలు ఇంటి పనులన్నీ నేర్చుకుని సమర్థవంతంగా వ్యవహరించేదని, దాని వల్ల ఆ ఇల్లు చక్కగా ఉండేదని నమ్మేవారు. అలాగే రైతు తన మనసు పెట్టి, ఇష్టంగా, శ్రద్ధగా సాగు చేసుకునే పొలం మంచి దిగుబడిని, ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా ఒక పనిని అంకిత భావంతో చేస్తే మంచి ఫలితం వస్తుందని ఈ సామెత చెబుతుంది.