News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 24, 2026
HYD: బీజేపీ కార్పొరేటర్ కన్నుమూత

గ్రేటర్ హైదరాబాద్ BJPలో తీవ్ర విషాదం నెలకొంది. నిత్యం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే చంపాపేట కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగా మధుసూదన్ రెడ్డి చనిపోయారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పార్టీ శ్రేణులు, ఇతర పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
News January 24, 2026
ఇకపై హైరైజ్ బిల్డింగులకు TDR మస్ట్!

సిటీలో 10 అంతస్తులపైన కట్టే బిల్డింగులకు ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. 10వ అంతస్తు పైన నిర్మించే ఏరియాలో 10% ఖచ్చితంగా TDR ద్వారానే నింపుకోవాలి. అంటే బిల్డర్లు TDR సర్టిఫికెట్లను కొనుగోలు చేయడం తప్పనిసరి. దీనివల్ల టీడీఆర్ కార్డులు ఉన్నవారికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది. ఈ సర్టిఫికెట్లను ఇప్పుడు HMDA పరిధిలో ఎక్కడైనా వాడుకోవచ్చు. చెరువుల బఫర్ జోన్ స్థలాలకు ఇప్పుడు ఏకంగా 300% TDR ఇస్తున్నారు.
News January 24, 2026
HYD: స్థలాలు ఇచ్చే వారికి సర్కార్ బంపర్ ఆఫర్!

రోడ్ల విస్తరణలో లేదా చెరువుల శిఖం భూముల్లో ఆస్తులు కోల్పోయేవారికి సర్కార్ అదిరిపోయే ఛాన్స్ ఇస్తోంది. ఆస్తికి బదులుగా నగదు కాకుండా TDR సర్టిఫికెట్లు ఇస్తారు. వీటితో పర్మిషన్ లేకపోయినా అదనంగా రెండు అంతస్తులు వేసుకోవచ్చు. రోడ్డు విస్తరణకు 400%, చెరువుల FTL భూములకు 200% టీడీఆర్ లభిస్తుంది. ఆధార్‌తో లింక్ అవ్వడం వల్ల మీ టీడీఆర్ ఎవరూ కొట్టేయలేరు, అంతా ఆన్‌లైన్ బ్యాంక్ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది.


