News June 17, 2024
HYD: చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..!

రంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.
Similar News
News January 14, 2026
ట్రాఫిక్ జామ్ ఇక గతం: భాగ్యనగరంలో త్వరలో నయా ‘హైవే’ మ్యాజిక్!

బండి బయటకు తీస్తే చాలు.. గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నరకాన్ని చూసున్న ఐటీ కారిడార్ వాసులకు ఇక ఆ ఇబ్బందులు తీరినట్లే! హైటెక్ సిటీ, మాదాపూర్, గొల్కొండ నుంచి ORR వరకు రోడ్ల రూపురేఖలను మార్చేందుకు HMDA సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. కేవలం రోడ్లే కాదు, పాదాచారుల కోసం ఆకాశ మార్గాలు (Sky walks), వాహనాల కోసం భారీ ఫ్లైఓవర్లతో 2050 నాటి అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు.
News January 14, 2026
HYD: బోగి మంటలు.. సంప్రదాయం వర్సెస్ ఆధునికం

RTC X రోడ్స్, చిక్కడపల్లి గల్లీల్లో భోగి మంటలు హోరెత్తుతున్నాయి. కానీ, హైటెక్ సిటీ వైపు వెళ్తే సీన్ రివర్స్ కనిపిస్తోంది. కాలుష్యం పేరిట అక్కడ మంటల బదులు ఎల్‌ఈడీ వెలుగులు, ఇండోర్ పూజలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తెల్లవారుజామున రోడ్లపై పెద్ద ఎత్తున వేసే మంటలు, మరోవైపు వాట్సాప్ గ్రూపుల్లో ‘గ్రీన్ గిల్ట్’ రాజకీయాలు పండగ జోష్ కంటే కూడా క్లాస్, ఎడ్యుకేషన్ ఇక్కడ మంటల సైజును డిసైడ్ చేస్తున్నాయి.
News January 13, 2026
హైదరాబాద్ ఖాళీ.. కాదు రద్దీ.. మీ కామెంట్?

HYD ఖాళీ అయ్యిందని కొందరి SM పోస్టులు వైరల్ అయ్యాయి. సంక్రాంతి కోసం జనాలు సొంతూళ్లకు వెళ్లారని దీని అర్థం. ఈ పరిస్థితి సిటీలో ఓ వైపు మాత్రమే కనిపిస్తోందని మరికొందరి వాదన. పండుగలకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ సాధారణమని, సిటీలో ఏ మూలకు వెళ్లిన ట్రాఫిక్ ఉందని చెబుతున్నారు. పల్లెబాట పట్టిన వీడియోలు, సిటీ రష్ వీడియోలు SMలో పోటీ పడుతున్నాయి. మరి మీ ఏరియాలో పరిస్థితి ఏంటి? కామెంట్ చేయండి.


