News February 8, 2025
HYD: జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు

ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్‌లో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ చర్యల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సత్వర స్పందన ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చని, అధికారులు సిబ్బంది విపత్తు నిర్వహణ విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: వనపర్తి: పుర పీఠంపై ‘హస్తం’ హవా.!

వనపర్తి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో జైత్రయాత్ర సాగించింది. మొత్తం 33 వార్డులకు గాను కాంగ్రెస్ 20 స్థానాలను కైవసం చేసుకొని పుర పీఠాన్ని దక్కించుకుంది. BRS 8, BJP 2, CPM 1, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. ఈ భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తల నినాదాలతో వనపర్తి వీధులన్నీ హోరెత్తాయి.
News February 13, 2026
మున్సిపల్ ఫలితాలు.. ఇప్పటి వరకు..

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు 65 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ గెలుపు జెండా ఎగరేసింది. BRS 14 చోట్ల గెలుపొందగా, BJP ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 34 చోట్ల హంగ్ ఏర్పడింది. వార్డుల్లో కాంగ్రెస్ 1,310, BRS 707, BJP 249చోట్ల గెలుపొందాయి. అటు మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.
News February 13, 2026
VJA: ఆత్మహత్యే శరణ్యం అనుకున్న వేళ.. అండగా నిలిచిన ట్రాఫిక్ పోలీసులు

కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు సిద్ధపడిన మహిళను, ఆమె ఇద్దరు చిన్నారులను విజయవాడ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. మచిలీపట్నానికి చెందిన స్వాతి భర్తతో గొడవపడి, విజయవాడ కాలువలో దూకుతానని ఫోన్ చేయడంతో అప్రమత్తమైన భర్త పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ట్రాఫిక్ RSI శ్రీధర్, కానిస్టేబుల్ నాగభూషణం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆమెను గుర్తించి ప్రాణాలు కాపాడారు. ట్రాఫిక్ DCP షరీనా బేగం సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.


