News August 23, 2025

HYD: జానపద దినోత్సవం రోజే రంగస్థల నటుడి మృతి

image

ప్రముఖ రంగస్థల నటుడు పూర్ణచంద్రశేఖర్‌ (73) గుండెపోటుతో మృతి చెందారు. శేరిలింగంపల్లిలో ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దేశ, విదేశాలల్లో చంద్రశేఖర్ అనేక ప్రదర్శనతో పేరుగాంచిన ఆయన జానపద దినోత్సవం రోజే కన్నుమూయడం కళకారులను కంటితడిపెట్టించింది. 2006లో చమన్‌లాల్‌ అవార్డు, AP ఉగాది పురస్కారం, 6 సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

Similar News

News January 15, 2026

BREAKING: టెర్రస్ వార్‌.. HYDలో చిందిన రక్తం

image

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

News January 15, 2026

HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

image

​శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.

News January 15, 2026

HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

image

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్‌ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయట.