News March 7, 2025
HYD: జానారెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. జానారెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. దాదాపు గంటపాటు జానారెడ్డితో పలు విషయాలపై చర్చించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం, జానారెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
Similar News
News December 11, 2025
గుంటూరుని బాల్యవివాహాల రహితంగా మార్చాలి: కలెక్టర్

బాల్యవివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఆ దిశగా అన్నీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. బాల్యవివాహాల అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని చెప్పారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) వంద రోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షలో మాట్లాడారు.
News December 11, 2025
పోలీస్ డార్మిటరీ భవనాన్ని పరిశీలించిన ఎస్పీ

ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ డార్మిటరీ భవనాన్ని ఎస్పీ ప్రతాప్ కిషోర్ గురువారం సందర్శించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నిర్మాణంలో చేపట్టవలసిన కొన్ని ముఖ్యమైన పనులతో పాటు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత కాంట్రాక్టర్, అధికారులకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలిచ్చారు.
News December 11, 2025
అఖండ-2 టికెట్ రేట్ల పెంపు జీవో సస్పెండ్

అఖండ-2 సినిమా <<18531616>>నిర్మాతలకు<<>> తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రీమియర్ షో టికెట్ల ధరల పెంపు జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో పాటు నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. అటు ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ మొదలవనుండగా ఇప్పటికే అభిమానులు రూ.600 పెట్టి టికెట్లు కొనుగోలు చేశారు.


