News April 11, 2025

HYD: జిమ్ ట్రైనర్ హత్య.. నిందితుల రిమాండ్

image

బోడుప్పల్‌లో జిమ్ ట్రైనర్‌ మర్డర్ వివరాలను పోలీసులు వెల్లడించారు. ఇందిరానగర్‌కు చెందిన చంటి భార్యతో జిమ్ ట్రెయినర్ సాయికిషోర్‌ చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో పుట్టింటికి వెళ్లింది. కక్షగట్టిన చంటి మర్డర్‌కు ప్లాన్ చేసి స్నేహితులు ధ్రువకుమార్‌సింగ్, శ్రీకాంత్, సాయికిరణ్‌‌తో కలిసి జిమ్‌లోనే అతడిపై డంబెల్‌తో దాడిచేయగా మృతిచెందాడు. రాత్రి నిందితులను రిమాండ్ చేశారు.

Similar News

News January 14, 2026

మకరజ్యోతి వేళ.. శబరిమలలో మరో స్కామ్!

image

కేరళ శబరిమల ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డులో మరో స్కామ్ బయటపడింది. అయ్యప్ప అభిషేకం కోసం భక్తులు ఆలయం వద్ద కొనే నెయ్యి ప్యాకెట్ల డబ్బు రూ.35 లక్షలు బోర్డుకు చేరలేదు. ఇది గుర్తించిన ప్రభుత్వం కేసును ACBకి అప్పగించింది. ఇప్పటికే 5Kgs బంగారు తాపడాల మిస్సింగ్ స్కామ్ రాజకీయంగానూ దుమారం రేపుతుండగా ఈ ఉదంతంతో ప్రభుత్వం మరింత కార్నర్ కానుంది. అటు ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది.

News January 14, 2026

బంగ్లా ఎన్నికలపై మైనార్టీల్లో భయాందోళనలు

image

బంగ్లాదేశ్‌లో FEB 12న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎన్నికల్లో పాల్గొనడంపై మైనార్టీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్యతా మండలి ప్రతినిధులు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్‌ను కలిశాయి. భద్రతపై ప్రజల ఆందోళనను తెలియజేశాయి. ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరాయి.

News January 14, 2026

HYD: సీఎం సభల తర్వాతే మున్సిపల్ నగారా!

image

TGలో మున్సిపల్ పోరుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అయితే, దీనికి ముందే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కలియతిరగనున్నారు. ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో 3 భారీ సభలు నిర్వహించనుంది. ప్రజల్లోకి వెళ్లిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ఈ సభలు ముగిసిన వెంటనే SEC ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీఎం టూర్ ఖరారైన తర్వాతే క్లారిటీ రానుంది. STAY TUNED..