News September 13, 2025
HYD: జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
సీనియర్లకు శృంగభంగం.. పట్టు బిగించిన జ్యోతుల

కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఈ పదవికి తోట నవీన్ పేరును సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎంపీ సానా సతీశ్ ప్రతిపాదించారు. అయితే తన కుమారుడికి అవకాశం కల్పించాలని జ్యోతుల నెహ్రూ కోరారు. మెట్ట ప్రాంతంలో పార్టీ బలోపేతం, రాజకీయ ప్రాధాన్యం దృష్ట్యా అధిష్ఠానం జ్యోతుల నెహ్రూ తనయుడివైపే మొగ్గు చూపిందని సమాచారం. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు జ్యోతుల కుటుంబానికి దక్కాయి.
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.
News December 17, 2025
తుది పోరు.. పోలింగ్ ప్రారంభం

తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మ.2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీ పోరు ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.


