News November 20, 2025
HYD: జెరియాట్రిక్ సేవలను విస్తరించాలి: మంత్రి

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్‌లో జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు.
Similar News
News January 17, 2026
పాతబస్తీ మెట్రోపై హైకోర్టు ఆరా.. ఫిబ్రవరి 4న కీలక నివేదిక!

MGBS-ఫలక్‌నుమా రూట్‌లో నిర్మించే మెట్రో లైన్ విషయంలో చారిత్రక కట్టడాల రక్షణపై హైకోర్టు దృష్టి సారించింది. చార్మినార్ వంటి కట్టడాల దృశ్య సౌందర్యం దెబ్బతినకుండా పిల్లర్ల నిర్మాణం ఎలా ఉంటుందో వర్చువల్ వాక్‌త్రూ ద్వారా FEB 4లోగా చూపాలని అధికారులను ఆదేశించింది. వారసత్వ సంపదకు నష్టం వాటిల్లని రీతిలో మెట్రో అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీని ఆధారంగానే 5.5KM మేర సాగే ఈ మెట్రో లైన్ ఖరారు కానుంది.
News January 17, 2026
లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త: సీపీ సజ్జనార్

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
News January 17, 2026
హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు సొంతం!

HYD మెట్రోలో కొత్త అధ్యాయం మొదలైంది. L&T కున్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తూ, మరో ₹2,000 కోట్లను వాటా కింద చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీంతో మెట్రో నిర్వహణ, టికెట్ ధరలు, విస్తరణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. ఈ ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేసి మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


