News November 19, 2025

HYD: జైలులో మొహియుద్దీన్‌పై దాడి

image

అహ్మదాబాద్ సబర్మతి జైలులో రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలే అతడిపై దాడి చేయడంతో జైలు భద్రతా సిబ్బంది కాపాడారు. గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చామని జైలు సూపరెంటెండెంట్ గౌరవ్ తెలిపారు. ఉగ్ర చర్యల్లో భాగంగా అతడు రిసిన్ నీటిలో కలపడానికి యత్నించాడనే అనుమానుంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 19, 2026

HYD: రికార్డుల్లో లేని నాలా.. రియల్టర్లకు నోట్ల మాలా..!

image

నగర శివార్లలో నాలాల విస్తరణకు కూడా 400% TDR ఇస్తామన్న కొత్త GO అక్రమార్కులకు వరంగా మారనుంది. రెవెన్యూ రికార్డుల్లో లేని కాలువలనూ పరిగణనలోకి తీసుకోవచ్చన్న వెసులుబాటును అడ్డం పెట్టుకుని కొందరు బడా రియల్టర్లు తమ వెంచర్ల మధ్యలో పనికిరాని గుంటలను నాలాగా చూపించుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కై రూ.కోట్లు విలువైన TDR సర్టిఫికెట్లు పొందేందుకు స్కెచ్ వేశారని విశ్లేషకుల అంచనా. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

సంగారెడ్డి: నేటి నుంచి కొత్త సర్పంచ్‌లకు శిక్షణ

image

జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు 19 నుంచి మార్చి 8 వరకు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. బైపాస్ రహదారిలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని చెప్పారు. బ్యాచ్‌కు 100 మంది చొప్పున మొత్తం ఆరు బ్యాచ్‌లో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.