News November 19, 2025

HYD: జైలులో మొహియుద్దీన్‌పై దాడి

image

అహ్మదాబాద్ సబర్మతి జైలులో రాజేంద్రనగర్‌కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్‌పై దాడి జరిగింది. తోటి ఖైదీలే అతడిపై దాడి చేయడంతో జైలు భద్రతా సిబ్బంది కాపాడారు. గాయపడిన అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి తిరిగి జైలుకు తీసుకొచ్చామని జైలు సూపరెంటెండెంట్ గౌరవ్ తెలిపారు. ఉగ్ర చర్యల్లో భాగంగా అతడు రిసిన్ నీటిలో కలపడానికి యత్నించాడనే అనుమానుంతో అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 17, 2026

UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి

image

పాఠశాల విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీచర్ల ప్రాణాలను బలిగొంది. నలుగురు ఉపాధ్యాయులు కలిసి కారులో తుంగతుర్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఇసుక కుప్పపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి KGBV ఎస్‌వో కల్పన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన రావులపల్లి HM గీతా రెడ్డిని HYDకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

News January 17, 2026

HYD: 10 నుంచి 12 జోన్లుగా HMDA విస్తరణ

image

HYD వేదికగా HMDA పునర్వ్యవస్థీకరణకు వేగం పెరిగింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. HMDA 10 నుంచి 12 జోన్లుగా విభజన చేసే అవకాశం ఉంది, ఈ మేరకు అదనపు అధికారులను నియమించనున్నారు. జోనల్ కార్యాలయాల పరిధిలో అనుమతులు ఇవ్వని అంశాలపై స్పష్టతనిస్తూ, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.

News January 17, 2026

HYD: 2025లో జనన, మరణాల్లో మగవారే TOP

image

పాత గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2025 ప్రారంభం నుంచి డిసెంబర్ 30 వరకు జనన, మరణాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ కాలంలో మొత్తం 2,01,652 జననాలు నమోదయ్యాయి. ఇందులో 1,03,622 మంది మగ శిశువులు, 98,030 మంది ఆడ శిశువులు జన్మించారు. అదే సమయంలో మొత్తం 83,936 మరణాలు చోటు చేసుకోగా, 46,797 మంది మగవారు, 37,139 మంది ఆడవారు మరణించినట్లు అధికారులు తెలిపారు.