News August 3, 2024

HYD: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

image

వాతావరణంలోని మార్పుల కారణంగా భాగ్యనగర ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలోనే సాధారణంగా HYD ఫీవర్ ఆస్పత్రిలో 100-200 ఓపీ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 300 నుంచి 600కు చేరింది. జులై నెల మొదటి 19 రోజుల్లోనే 7089 ఓపీలు, 54 డెంగ్యూ కేసులు, 108 డిఫ్తీరియా కేసులు నమోదైనట్లు రిపోర్ట్ విడుదల చేశారు. 4 రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News September 8, 2024

HYD: అలా చేస్తే.. ఏడు జిల్లాల్లో ఆక్రమణలకు చెక్!

image

HYD నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏ మాత్రం తగ్గటం లేదు. దీంతో HMDA పరిధిలోని 7 జిల్లాల్లో చెరువుల పరిరక్షణ కోసం లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను సైతం హైడ్రాకు అప్పగించడంపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇదే కాని జరిగితే.. HYD, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చెరువుల ఆక్రమణలకు చెక్ పడనుంది.

News September 8, 2024

HYD: కొత్తపేటలో 54 అడుగుల కాలభైరవ మట్టి గణపతి

image

HYD కొత్తపేటలోని మోహన్ నగర్‌లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణహితంగా భారీ మట్టి గణపతిని తిరంగా యూత్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేశారు. 18 ఏళ్ల నుంచి గణపతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 54 అడుగుల కాలభైరవ ఉగ్రరూప మహాగణపతిని ప్రతిష్ఠించినట్లు పేర్కొన్నారు. ప్రముఖ శిల్పి నగేశ్ మట్టి గణపతిని రూపొందించినట్లు తెలిపారు.

News September 8, 2024

HYD: బాలాపూర్ గణపతి ప్రత్యేకతలు ఇవే..!

image

HYD బాలాపూర్ గణపతిని కళాకారులు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తలపై భాగంలో అమృతం కోసం సముద్ర మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహ చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడో చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.