News August 3, 2024

HYD: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

image

వాతావరణంలోని మార్పుల కారణంగా భాగ్యనగర ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలోనే సాధారణంగా HYD ఫీవర్ ఆస్పత్రిలో 100-200 ఓపీ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 300 నుంచి 600కు చేరింది. జులై నెల మొదటి 19 రోజుల్లోనే 7089 ఓపీలు, 54 డెంగ్యూ కేసులు, 108 డిఫ్తీరియా కేసులు నమోదైనట్లు రిపోర్ట్ విడుదల చేశారు. 4 రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News December 14, 2025

చేవెళ్ల: కూతురుకు ఓటేసి.. తండ్రి మృతి

image

ఎన్నికల్లో పోటీచేసిన తన కూతురుకి ఓటు వేసిన ఓ తండ్రి కుప్పకూలాడు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని 14వ వార్డులో ఓటు వేసి బయటకు వచ్చిన వృద్ధుడు సోలిపేట బుచ్చయ్య (70) చనిపోయారు. ఆలూరు పంచాయతీకి అనుబంధ గ్రామం వెంకన్నగూడ 14వ వార్డులో ఆయన కుమార్తె రాములమ్మ వార్డు సభ్యురాలుగా పోటీలో ఉంది. ఓటు వేసి వస్తుండగా వృద్ధుడు కుప్పకూలి మృతి చెందాడు. అతని మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

News December 14, 2025

చేవెళ్ల: సర్పంచ్ ఏకగ్రీవం.. ఒకే వార్డుకు ఎన్నిక.. ఫలితం ఉప సర్పంచ్

image

చేవెళ్ల మండలం చన్వెల్లి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. ఈ పంచాయతీ పరిధిలోని మొత్తం 10 వార్డులు ఉండగా 9 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 8వ వార్డు జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు సుధాకర్(SC)తో పాటు ఓసీ అభ్యర్థి పి.దీపక్ రెడ్డి పోటీ పడ్డారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాల్లో దీపక్ రెడ్డి విజయం సాధించారు. ఉప సర్పంచ్‌గా అతను ఎన్నికయ్యారు.

News December 14, 2025

RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌‌గా రాములు

image

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.