News May 3, 2024
HYD: టాప్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలి: సీఎస్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను కోరారు. ఈఓడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన సంస్కరణలపై సీఎస్ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై నెలాఖరులోగా ఈఓడీబీ కింద చేపట్టాల్సిన అన్ని సంస్కరణలను పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News December 17, 2025
HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్‌స్టా-కేఫ్‌ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.
News December 17, 2025
HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.