News November 19, 2025

HYD: ‘డ్రగ్స్ వద్దు.. కెరీర్ ముద్దు’

image

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి జోలికి వెళ్తే జీవితం అగమ్య గోచరంగా మారుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవేర్నెస్ కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్, టీ న్యాబ్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 17, 2026

రిపబ్లిక్ డే వేడుకలకు ఉగ్ర ముప్పు!

image

రిపబ్లిక్ డే వేడుకలను ఉగ్ర సంస్థలు టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఖలిస్థానీ, బంగ్లా టెర్రర్ సంస్థలు దాడులకు ప్లాన్ చేసినట్లు వెల్లడించాయి. హరియాణా, పంజాబ్, ఢిల్లీ-NCR, UP, రాజస్థాన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాదులతో లింక్ ఉన్న గ్యాంగ్‌స్టర్లు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపాయి. గతేడాది ఢిల్లీలో <<18265346>>కారు పేలుడు<<>> నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి.

News January 17, 2026

వికారాబాద్: ఖరారైన మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు

image

వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో ఎస్సీ మహిళ, తాండూరు మున్సిపాలిటీ బీసీ జనరల్, పరిగి మున్సిపాలిటీలో బీసీ మహిళ, కొడంగల్ – అన్ రిజర్వుడ్‌గా వచ్చింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు ఛైర్మన్ పదవిపై కన్నేశారు. కొడంగల్లో అన్ రిజర్వుడ్ కావడంతో పోటీ పెరగనుంది.

News January 17, 2026

సిద్దిపేట జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

image

సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సిద్దిపేటను బీసీ జనరల్‌కు, చేర్యాలను ఎస్సీ మహిళకు, హుస్నాబాద్‌ను ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. గజ్వేల్, దుబ్బాక స్థానాలు బీసీ మహిళలకు దక్కాయి. రిజర్వేషన్లు తేలడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొనగా, ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.