News November 19, 2025
HYD: ‘డ్రగ్స్ వద్దు.. కెరీర్ ముద్దు’

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి జోలికి వెళ్తే జీవితం అగమ్య గోచరంగా మారుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గాంధీ మెడికల్ కాలేజీలో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాల సందర్భంగా మెడికల్ విద్యార్థులకు డ్రగ్స్‌పై అవేర్నెస్ కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్, టీ న్యాబ్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 18, 2026
బల్కంపేట్ ఎల్లమ్మకి మౌని అమావాస్య ప్రత్యేక పూజలు

మౌని అమావాస్య సందర్భంగా బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతోందని భక్తులు తెలిపారు.
News January 18, 2026
సీపీఐ 100 ఏళ్ల పండుగకు సీఎం

ఖమ్మంలో నేడు జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. కాగా ఈ సభకు రావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం సీఎంకు ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. మిత్రపక్షం ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి సభకు వెళ్తున్నారు.
News January 18, 2026
హైదరాబాద్ మళ్లీ ‘ఆమె’దే!

త్వరలో ఎన్నికలు జరగనున్న జీహెచ్ఎంసీ కొత్త పాలక మండలిలో మేయర్‌గా మరోసారి మహిళే ఎన్నిక కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల ఛైర్మన్లు, మేయర్లకు శనివారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. పది మున్సిపల్ కార్పొరేషన్లకు గానూ జీహెచ్ఎంసీకి మహిళ (జనరల్) రిజర్వు కావడంతో రాబోయే పాలకమండలిలోనూ హైదరాబాద్‌లో మహిళే చక్రం తిప్పనున్నారు.


