News March 18, 2024
HYD: ఢీకొట్టిన ట్రైన్.. కాళ్లు తెగి వ్యక్తి మృతి

రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అల్వాల్‌లో నివాసం ఉండే కే.దుర్గయ్య(41) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సనత్‌నగర్-అమ్ముగూడ రైల్వేస్టేషన్ల మధ్య అతడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగి, చికిత్స పొందుతూ మరణించాడు.
Similar News
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.
News December 14, 2025
డీలిమిటేషన్.. పోటెత్తిన ఫిర్యాదులు

GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతను ఈ ఫిర్యాదుల సంఖ్య సూచిస్తోంది.
News December 14, 2025
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్

IT కారిడార్‌లో ట్రాఫిక్‌ను దెబ్బతీస్తున్న కీలకమైన ICCC నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 9KM ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు HMDA పచ్చజెండా ఊపింది. తాజాగా DPR కోసం టెక్నికల్ కన్సల్టెంట్‌లను ఇన్వైట్ చేసింది. 11.6 కి.మీ. PVNR Expresswayను పోలిన ఈ నూతన మార్గం, నగరంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ వెస్ట్ సిటీకి పర్మినెంట్ ట్రాఫిక్ సొల్యూషన్ అందించనుంది.


