News April 30, 2024
HYD: తండ్రి తిట్టాడని బాలిక సూసైడ్

మద్యం మత్తులో తండ్రి తిట్టడంతో 8వ తరగతి చదువుతున్న బాలిక(15) ఆత్మహత్య చేసుకొన్న ఘటన రాయదుర్గం PS పరిధి టెలికాంనగర్‌లో వెలుగుచూసింది. AP నంద్యాల జిల్లా లక్ష్మీపురానికి చెందిన దుద్దుకూరు సరోజ తన కుటుంబంతో కలిసి నగరానికి వచ్చింది. టెలికాంనగర్‌లోని గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. సోమవారం సరోజ రెండవ కూతురు రేవతిని తండ్రి తిట్టడంతో ఉరేసుకొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.
News December 14, 2025
డీలిమిటేషన్.. పోటెత్తిన ఫిర్యాదులు

GHMC వార్డుల డీలిమిటేషన్ మీద అభ్యంతరాల వెల్లువ కొనసాగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 693 ఫిర్యాదులు అందడం అధికార యంత్రాంగాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి రోజు (డిసెంబర్ 10) 40 ఫిర్యాదులు, రెండవ రోజు 280, అత్యధికంగా 373 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కొత్తగా విలీనమైన 27 మున్సిపాలిటీల్లోనే ఈ అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతను ఈ ఫిర్యాదుల సంఖ్య సూచిస్తోంది.
News December 14, 2025
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్

IT కారిడార్‌లో ట్రాఫిక్‌ను దెబ్బతీస్తున్న కీలకమైన ICCC నుంచి శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 9KM ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు HMDA పచ్చజెండా ఊపింది. తాజాగా DPR కోసం టెక్నికల్ కన్సల్టెంట్‌లను ఇన్వైట్ చేసింది. 11.6 కి.మీ. PVNR Expresswayను పోలిన ఈ నూతన మార్గం, నగరంలో అత్యంత పొడవైన ఫ్లైఓవర్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్ వెస్ట్ సిటీకి పర్మినెంట్ ట్రాఫిక్ సొల్యూషన్ అందించనుంది.


