News August 21, 2025

HYD: తాను చనిపోతూ ఏడుగురికి పునర్జన్మ

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణాలు పోశాడు. మియాపూర్‌కు చెందిన కృష్ణ సుమంత్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. AUG 18న విధులు ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై, ఆస్పత్రిలో చేరాడు. బుధవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. జీవన్‌దాన్ వారు కృష్ణ తండ్రితో మాట్లాడి గుండె, కిడ్నీలు, లివర్, లంగ్స్, కళ్లు దానం చేయమన్నారు. అవయవదానం చేసి కృష్ణ ఏడుగురికి పునర్జన్మ ఇచ్చాడు.

Similar News

News January 16, 2026

సంగారెడ్డి: మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కేటగిరీల వారిగా రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఏ వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో వార్డుల వారిగా రిజర్వేషన్లు విడుదలై అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల రిజర్వేషన్లు ఖరారైనట్లు సమాచారం. అయితే అధికారికంగా రిజర్వేషన్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News January 16, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 12.4℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగారంలో 12.8℃, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్‌లో 12.9℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 13.1℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 16, 2026

ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో BJP కూటమి

image

మహారాష్ట్రలో ముంబై, పుణే సహా 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. BMCలో ఎర్లీ ట్రెండ్స్‌ ప్రకారం BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి మాత్రం వెనుకంజలో ఉంది. దాదాపు 50% పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి.