News October 6, 2025

HYD: తూచ్.. ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేయలేదు..!

image

తూచ్.. అసలు బదిలీ క్యాన్సల్ అన్నట్లు ఉంది వ్యవహారం. నిన్న జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డిని బదిలీ చేస్తూ అనంతరం అక్కడ సైదులును నియమిస్తూ పోలీస్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 24 గంటల తర్వాత నోటిఫికేషన్‌లో మార్పు చేస్తూ యధావిధిగా వెంకటేశ్వర రెడ్డిని కొనసాగించింది. ఎస్‌బీకి సైదులును ట్రాన్స్‌ఫర్ చేశారు.

Similar News

News January 20, 2026

మెరుగైన శిక్షణతో విధుల్లో మరింత రాణించగలం: వరంగల్ సీపీ

image

పోలీస్ అధికారులు, సిబ్బంది మెరుగైన శిక్షణ పూర్తి చేయడం ద్వారా అప్పగించిన పనుల్లో మరింత రాణించగలమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆర్మూడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ హైదరాబాద్ యూసుఫ్‌గూడలో నిర్వహించిన ఆరు నెలల ఆయుధ మరమ్మతులపై శిక్షణ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంతో శిక్షణా కేంద్రం నుంచి జారీ చేసిన ధ్రువ పత్రాన్ని శివకుమార్‌కు సీపీ అందజేశారు.

News January 20, 2026

ప్రజల దృష్టి మళ్లించేందుకు CM ఎత్తులు: లక్ష్మణ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తేల్చకుండా CM రేవంత్ రెండేళ్లుగా దర్యాప్తు పేరిట కాలయాపన చేశారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్‌పై కవిత చేసిన ఆరోపణలకు BRS సమాధానం చెప్పాలి’ అని ఢిల్లీలో ఆయన పేర్కొన్నారు. కలహాలతో BRS ముక్కలవుతుందని జోస్యం చెప్పారు.

News January 20, 2026

‘కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటును అడ్డుకోలేం’

image

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ ప్రాంతాలను కార్పొరేషన్‌లో కలపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(ZC)కి విరుద్ధమని దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. అయితే ఏర్పాటును అడ్డుకోలేమని పేర్కొంటూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.