News December 1, 2025
HYD: త్వరలో ఈ ప్రాంతల్లో సైతం జలమండలి..!

ORR బయట, లోపల ఉన్న ఏరియాలను సైతం జలమండలిలోకి కలపటం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో ORR చుట్టూ లోపల, బయట విస్తరించనుంది. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ కనెక్షన్స్ ఇక జలమండలి పరిధిలోకి రానున్నాయి.
Similar News
News February 18, 2026
ఇంటి దేవుడిని పూజించడానికి అనువైన రోజు ఏదంటే?

కుజ గ్రహం, హనుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. ఈ రోజున ఇంటి దేవుడిని పూజిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు పండితులు. ‘మంగళవారం రోజున ఇలవేల్పును పూజిస్తే జాతక దోషాలు తొలగి, మనసులో ధైర్యం, పట్టుదల పెరుగుతుంది. ఈరోజు చేసే ప్రత్యేక పూజలతో ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. కుటుంబీకులు అందరూ పూజలో పాల్గొనడం ఉత్తమం’ అని సూచిస్తున్నారు.
News February 18, 2026
మీరు ఎన్నటికీ గెలవలేరు: ఖమేనీ

ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడంలో అమెరికా ఎప్పటికీ విజయం సాధించలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అన్నారు. ‘వారిది ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి అని US అధ్యక్షుడు చెబుతున్నారు. అలాంటి శక్తి కూడా తీవ్రంగా దెబ్బతినొచ్చు. మళ్లీ కోలుకోదు. యుద్ధనౌకలు ప్రమాదకరమే. కానీ వాటిని సముద్రం అడుగుకు పంపగల ఆయుధాలు ఇంకా ప్రమాదకరం’ అని హెచ్చరించారు. తమ అణు పరిశ్రమ దేశాన్ని నడిపించేందుకేనని, యుద్ధానికి కాదని చెప్పారు.
News February 18, 2026
హిందువులు ముగ్గురు పిల్లల్ని కనాలి: భాగవత్

దేశంలో హిందువుల జనాభా తగ్గుతోందని RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘హిందువులను శక్తిమంతం చేయాలి. ఇప్పుడు ఎలాంటి ముప్పు లేదు. కానీ అప్రమత్తత అవసరం’ అని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చొరబాటుదారులను గుర్తించి పంపేయాలని, ఉపాధి కల్పించకూడదని అన్నారు.


