News June 17, 2024
HYD: త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించారు. ఎన్నికల ముందు దీనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినా కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం, రైల్వే మంత్రిగా అశ్విన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించడం, కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి అవడంతో త్వరలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.
Similar News
News January 17, 2026
భూగర్భంలో JBS- శామీర్‌పేట మెట్రో..!

హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2లో భాగంగా జేబీఎస్(JBS) నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారి మీదుగా సుమారు 17 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్ నిర్మిస్తున్నారు. ఇది ఉత్తర హైదరాబాద్ ప్రయాణాన్ని సులభతరం చేసే కీలక ప్రాజెక్ట్. ఈ దారిలో ఉన్న హకీంపేట ఎయిర్ బేస్ రక్షణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో ఆర్మీ నిబంధనల ప్రకారం అక్కడ మెట్రోను పిల్లర్లపై కాకుండా భూగర్భంలో (<<18874590>>Underground<<>>) నిర్మించాల్సి వస్తోంది.
News January 17, 2026
HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.
News January 17, 2026
రాడార్ల కోసం ‘అండర్ గ్రౌండ్’ మెట్రో

జేబీఎస్-శామీర్‌పేట మెట్రో వైర్ల నుంచి వెలువడే హై-వోల్టేజ్ కరెంటు యుద్ధ విమానాల రాడార్లకు ముప్పుగా మారుతుందని 2025 చివరలో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రేడియేషన్ వల్ల విమానాల ‘టార్గెట్ లాకింగ్’ సిస్టమ్స్ దెబ్బతింటాయని తేలింది. అందుకే ఈ కారిడార్‌లో హకీంపేట వద్ద మెట్రోను <<18874537>>భూమి లోపల<<>> సొరంగంలో తీసుకెళ్తే ఆ మట్టి ఒక సహజ కవచంలా పనిచేసి సిగ్నల్స్ బయటకు రాకుండా ఆపుతుందని ప్లాన్ చేశారు.


