News April 26, 2024

HYD: త్వరలో HMDA భూములకు జియో ట్యాగ్!

image

HMDA భూములకు సాంకేతికతను జోడించి భూ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ‘జియో ట్యాగ్’ విధానానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా HYD సహా ఇతర జిల్లాల్లో ఉన్న HMDA భూముల్లో ఎలాంటి నిర్మాణం జరిగినా.. ఇట్టే గూగుల్ ఇమేజ్ ద్వారా తెలిసిపోనుంది. HMDA భూముల్లోనూ జరిగే ఆక్రమణలకు దీని ద్వారా ఓ పరిష్కారం లభిస్తుందని సర్కారు భావిస్తోంది. 

Similar News

News April 18, 2026

KPHBలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

image

KPHB మెట్రో పిల్లర్ నంబర్ A-834 వద్ద శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. గచ్చిబౌలి నుంచి పాలకొల్లు వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు ఉండగా, అప్రమత్తతతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు.

News April 17, 2026

రంగారెడ్డిలో భానుడి భగభగ.. జనం విలవిల

image

ఉమ్మడి జిల్లాను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌లో 41.8, మేడ్చల్‌లో 41.7 డిగ్రీల వేడి రికార్డయ్యింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.