News April 1, 2024

HYD: దూకుడు పెంచిన మజ్లిస్‌ పార్టీ

image

పార్లమెంట్‌ ఎన్నికల కోసం మజ్లిస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్‌ పార్టీ.. రంజాన్‌ మాసం ఇఫ్తార్‌ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి సైతం పోలింగ్‌ పెంపుపై దృష్టి సారించింది.

Similar News

News February 7, 2026

HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

image

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

News February 7, 2026

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ @278

image

హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ శనివారం తెల్లవారుజామున గాజులరామారంలో 278గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 7, 2026

HYD: అవినీతికి నిలయంగా GHMC ‘ఇంజినీరింగ్‌’ విభాగం..?

image

GHMCలో అత్యధిక అవినీతి విభాగంగా ఇంజినీర్ విభాగం మారింది. ఓవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న.. వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఒక్కో టెండర్‌కు ఒక్కో నిబంధనలో పెడుతూ కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొందరు లంచాలకు కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్నారు. వీటికి ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దాడులే నిదర్శనం.