News June 17, 2024

HYD: ధార్ GANG చరిత్ర ఇదే..!

image

గ్రేటర్ HYDలో కలకలం సృష్టిస్తోన్న భయంకరమైన ధార్ గ్యాంగ్ గతంలోనూ చోరీలకు పాల్పడింది. MP,UPకి చెందిన ఈ గ్యాంగ్ చివరిసారిగా 2022లో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేసింది. ధార్ ముఠాపై 2018-2022మధ్య సైబరాబాద్‌లో 138,రాచకొండలో 32చోరీ కేసులు నమోదయ్యాయి. కాగా అప్పుడు ఈముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో రెండేళ్లుగా ఇటు వైపు రాలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి వరుస చోరీలు చేస్తున్నారు.

Similar News

News January 15, 2026

HYD: రేపు రాత్రి ఆకాశంలో జాతర

image

సంక్రాంతి వేళ పతంగుల జోష్ మామూలుగా లేదు. భోగి వేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంతా భవనాల మీద తెగ ఎంజాయ్ చేశారు. పతంగులు కాట్ చేస్తూ కేరింతలు చేశారు. ఇక రేపు రాత్రి కూడా వైబ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా బేగంబజార్‌లో నైట్ కైట్ ఫెస్టివల్ అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం తర్వాత చిన్న ఎయిర్‌బెలూన్‌లు, లైట్ పతంగులను భవనాల మీద ఎగరేస్తుంటారు. ఇక్కడ పతంగుల జాతరను చూసేందుకు నగర నలుమూలల నుంచి తరలివెళ్తారు.

News January 14, 2026

హైదరాబాద్‌లో GEN Z రూల్స్!

image

జాబ్ విషయంలో GEN Z కొత్తదారులు వెతుకుతోంది. IT కారిడార్‌లోని ఆఫీస్ నిబంధనలు, టైమింగ్, వర్క్ ప్రెషర్‌‌ను అవాయిడ్ చేస్తున్నారు. పర్మనెంట్ అనే ఆలోచన పక్కనబెట్టి జాబ్ నచ్చితేనే చేస్తామంటున్నారు. 1, 2 ఏళ్లలో ఉద్యోగాలకు రిజైన్‌ చేస్తున్న వారిలో GEN Z మెజారిటీ ఎక్కువ అని ఇటీవల సర్వేలో తేలింది. డెడికేషన్ ఉన్నా.. చిల్ అవ్వకుంటే ఎలా? అనే ఫీల్‌లో ఉంటున్నారు. WFH అయితే ఇంకా బెటర్ అంటున్నారు.

News January 14, 2026

HYD: డస్ట్ బిన్‌లే ఆఫీస్‌కు కాల్ చేస్తాయి!

image

రోడ్డు మీద డస్ట్‌బిన్లు నిండిపోయి వాసన వస్తున్నాయా? ఫ్యూచర్ సిటీలో ఆ ఛాన్స్ లేదు. ముచ్చర్లలో రాబోతున్న ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఇండియాలోనే అతిపెద్ద ‘జీరో-హ్యూమన్ ఇంటర్వెన్షన్’ ప్రాజెక్ట్. ప్రతి బిన్‌కు అమర్చే ‘సెన్సార్లు’ చెత్త 80% నిండగానే కమాండ్ సెంటర్‌కు సిగ్నల్ పంపిస్తాయి. డ్రైవర్ లేని ‘ఎలక్ట్రిక్ వ్యాన్లు’ ఎప్పటికప్పుడు ఆ బిన్‌ను ఖాళీ చేస్తాయి. దావోస్‌లో CM చూపించబోయే ‘క్లీన్’ సిటీ సీక్రెట్ ఇదే.