News May 23, 2024

HYD నగరంపై బ్రిటిష్ హై కమిషనర్ ప్రశంసలు

image

HYD నగరంలోని ఆర్కిటెక్చర్ అందాలు, పురాతన కట్టడాలపై బ్రిటిష్ హై కమిషనర్ కామెరాన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా 300 ఏళ్ల చరిత్ర కలిగిన బన్సీలాల్ పేట మెట్ల బావిని సందర్శించిన ఆమె పునరుద్ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం చార్మినార్ వద్ద ఇరానీ టీ, ఉస్మానియా బిస్కెట్ తిని ఆస్వాదించారు. HYD నగరాన్ని సందర్శించడంతో తనివి తీర ఆనందం లభించిందని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2026

HYDలో రూ.430 కోట్లతో మరో కేబుల్ బ్రిడ్జ్

image

HYDలో మరో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. మీర్ ఆలం ట్యాంక్ మీదుగా ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీనిని 2.65 KMల పొడవు, 22.2 మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఈ బ్రిడ్జి మీర్ ఆలం ట్యాంక్ సమీపంలోని NH 44 నుంచి మీర్ ఆలం పార్క్ సమీపంలోని చింతల్మెట్ రోడ్డు వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.430 CR మంజూరు చేసింది. MP అసదుద్దీన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు.

News March 10, 2026

HYD: మూడు ముక్కలు.. కానీ ‘POWER’ అక్కడే!

image

గ్రేటర్ HYDను 3 కార్పొరేషన్లు(GHMC, MMC, CMC)గా విభజించారు. అయితే తెలంగాణ మున్సిపల్ చట్టం(సవరణ) 2024 ప్రకారం 10 అంతస్తులపైన కట్టే ‘హై రైజ్’ బిల్డింగుల పర్మిషన్ ఫీజు ఇకపై నేరుగా HMDA ఖాతాలోకి వెళ్తుంది. అంటే కొత్తగా ఏర్పడిన MMC, CMCలకు కేవలం డ్రైనేజీ, చెత్త ఏరడం వంటి ఖర్చులతో కూడిన పనులే మిగిలాయి. ఆదాయం వచ్చే పర్మిషన్ల పవర్ లేకపోవడంతో ఈ సంస్థలు భవిష్యత్తులో జీతాల కోసం అప్పులు చేయక తప్పని పరిస్థితి.

News March 10, 2026

REWIND: పోలీసుల కళ్లుగప్పి.. పడవలో ట్యాంక్ బండ్‌కు..!

image

15ఏళ్ల క్రితం మిలియన్ మార్చ్ వేళ ట్యాంక్‌ బండ్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. ఉద్యమాన్ని అడ్డుకోవాలని ఆందోళనకారులు నెక్లెస్ రోడ్డుకు రాకుండా పోలీసులు నలుదిక్కులా మోహరించారు. అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు, అరెస్టులతో నిలువరించారు. దీంతో అప్పట్లో ఈ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమనేత హరీశ్‌రావు హుస్సేన్‌సాగర్‌లో పడవలో ప్రయాణించి ట్యాంక్‌ బండ్‌కు చేరుకొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.