News November 7, 2025
HYD నగరానికి ప్రతిష్ఠాత్మక అవార్డు!

తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించింది. హైదరాబాద్ నగరం “సిటీ విత్ బెస్ట్ గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ ఇనిషియేటివ్” అవార్డు అందుకుంది. సుస్థిర నగర రవాణా విధానాలు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణలో రాష్ట్రం చూపిన నాయకత్వాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ విజయానికి టీజీ–రెడ్కో (TGREDCO) చేసిన కృషి కీలకమైంది.
Similar News
News January 24, 2026
ఏలూరు: ప్రమాదం.. బావాబామ్మరుదులు మృతి

గ్రీన్ ఫీల్డ్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన కొమ్ము సాయి, కామవరపుకోట మండలం రామవరానికి చెందిన గట్టు రాంబాబు మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై బైక్ అదుపు తప్పి రైలింగ్ ఢీకొనడంతో వారిద్దరూ మృతి చెందారు. వారిద్దరూ వరుసకు బావ బావమరుదులు. మొక్కజొన్న కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిసింది.
News January 24, 2026
14.6 డిగ్రీలకు పడిపోయిన పటాన్‌చెరు ఉష్ణోగ్రత

సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. శనివారం ఉదయం జిన్నారంలో 16.0°, గుమ్మడిదలలో 17.9°, అమీన్పూర్‌లో 18.8°, రామచంద్రాపురంలో 18.7°, పటాన్‌చెరులో 14.6° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం 88.4%గా ఉంది. ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో విజిబిలిటీ తగ్గి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
News January 24, 2026
అనకాపల్లి మీదుగా విశాఖ చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

అనకాపల్లి మీదుగా విశాఖ-చర్లపల్లి-విశాఖ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజనల్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 సాయంత్రం ఐదున్నర గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం చర్లపల్లి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 26 మధ్యాహ్నం 3:30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖ చేరుకుంటుందన్నారు. దీనికి అనకాపల్లిలో హాల్ట్ సౌకర్యం ఉందన్నారు.


