News August 10, 2024
HYD నిమ్స్‌లో అడ్మిషన్లు

HYD పంజాగుట్ట నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని యాజమాన్యం ప్రకటనలో కోరింది. ఇందులో భాగంగా బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ నర్సింగ్ 100 సీట్లు, బీఎస్సీ డిగ్రీ కోర్సులో 100 సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆసక్తి గల వారు ఈ నెల 23లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Similar News
News December 17, 2025
HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.