News September 11, 2025
HYD నుంచి హైస్పీడ్ రైళ్లు!

HYD నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాలి. భవిష్యత్తులో ఈ బాధలు తప్పనున్నాయి. సిటీ నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి హైస్పీడ్ రైళ్లు త్వరలో రానున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు లైన్లు ఓకే కాగా.. ఇప్పుడు అమరావతి రూట్ మ్యాప్ క్లియర్ అయిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఆ సిటీలకు ఇక రయ్..రయ్..మంటూ వెళ్లడమే.
Similar News
News December 9, 2025
కాకినాడ: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

నేడు కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446160, టోల్ ఫ్రీ 1064,14400 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం.
News December 9, 2025
ఆసిఫాబాద్: ‘సైలెన్స్ పీరియడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’

గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సా.5 గంటలకు ముగుస్తుందని ASF జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. ‘పోలింగ్‌కు 44 గంటల ముందు నిశబ్ద వ్యవధి అమలులోకి రానుంది. ఈ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు నిషేధం. ఇతర ప్రాంతాల వారు పంచాయతీ పరిధిలో ఉండరాదు. బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి’ అని అన్నారు.
News December 9, 2025
కేజీ నిమ్మ రూ.6.. రైతుల గగ్గోలు

AP: రాష్ట్రంలో నిమ్మకాయ ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు, నంద్యాల జిల్లాలోని నిమ్మ మార్కెట్‌లలో 80 కేజీల బస్తా రకాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,000 మాత్రమే పలుకుతోంది. కిలోకు రూ.6-12 మాత్రమే వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది ఇదే సమయంలో కేజీ రూ.40 వరకు పలికిందని చెబుతున్నారు.


