News September 11, 2025
HYD నుంచి హైస్పీడ్ రైళ్లు!

HYD నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి వెళ్లాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాలి. భవిష్యత్తులో ఈ బాధలు తప్పనున్నాయి. సిటీ నుంచి చెన్నయ్, బెంగళూరు, అమరావతికి హైస్పీడ్ రైళ్లు త్వరలో రానున్నాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు లైన్లు ఓకే కాగా.. ఇప్పుడు అమరావతి రూట్ మ్యాప్ క్లియర్ అయిందని తెలిసింది. అన్నీ అనుకూలిస్తే ఆ సిటీలకు ఇక రయ్..రయ్..మంటూ వెళ్లడమే.
Similar News
News December 14, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 886 మంది దొరికారు!

నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హైదరాబాద్-సైబరాబాద్ పోలీసులు ఆయా కమిషనరేట్ల పరిధిలో వీకెండ్ డ్రంక్&డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో HYD-460, CYB-426 మంది పట్టుబడ్డారు. వాహనాలను సీజ్ చేసిన పోలీసులు పట్టుబడ్డ మందుబాబుల మీద కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చనున్నట్లు స్పష్టం చేశారు. మద్యం తాగి రోడ్డెక్కితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 14, 2025
HYD: అరుదైన దృశ్యం.. ఇంటిపై ఇలవేల్పు!

మేడ్చల్ జిల్లా రాంపల్లిలో కులవృత్తి గౌరవాన్ని చాటిచెప్పే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎలిజాల మహేశ్ గౌడ్ తన ఇంటి ఎలివేషన్‌పై తాటి చెట్టెక్కుతున్నట్లు.. కల్లు పోస్తున్నట్లు సంప్రదాయ దృశ్యాలతో కళాత్మకంగా అలంకరించారు. వృత్తి సంస్కృతిని తరతరాలకు గుర్తు చేసేలా రూపొందిన ఈ అలంకరణ స్థానికులను ఆకట్టుకుంటోంది. కులవృత్తి పట్ల గుర్తింపును చాటే ఈ ప్రయత్నం ప్రశంసలు అందుకుంటోంది.
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.


