News April 23, 2025

HYD: నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్

image

నెహ్రూ జూలాజికల్ పార్కులో హైదరాబాద్ జూ జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. మే మొదటి వారంలో ప్రారంభమై జూన్ వరకు ఈ సమ్మర్ క్యాంపు ఉంటుందన్నారు. 5 నుంచి పదవ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఒక్కరికి రూ.1000 ఫీజు ఉంటుందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంప్‌లో జూ టూర్, సరీసృపాల అవగాహన సెషన్, నైట్ హౌస్ సందర్శన, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు.

Similar News

News March 17, 2026

వికారాబాద్‌లో వరుస సెలవులు!

image

వికారాబాద్‌లో ఒక్కపూట బడులు ప్రారంభం కావడంతో పాటు మార్చి నెలలో పండుగల సెలవులు కలిసొస్తున్నాయి. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస విరామం దొరకనుంది. దీంతో అటు పండుగలు, ఇటు పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు నిమగ్నమయ్యారు.

News March 17, 2026

రాజమండ్రి: మార్చి 19న ఉగాది పురస్కారాలు

image

రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను గౌరవించేందుకు మార్చి 19న ‘శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కార మహోత్సవం’ నిర్వహించనున్నట్లు MP పురందీశ్వరి మంగళవారం తెలిపారు. నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద ఈ వేడుకకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రతిభావంతులను సముచిత రీతిలో సన్మానిస్తామని వెల్లడించారు.

News March 17, 2026

అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.