News March 31, 2024

HYD: నేటితో ముగియనున్న ఓటీఎస్

image

ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులకు వన్‌ టైం సెటిల్‌మెంట్ స్కీం రాయితీ నేటితో ముగియనున్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల లోపు తమ ప్రాపర్టీ టాక్స్ చెల్లించి వడ్డీ పై 90% రాయితీ పొందవచ్చని తెలిపారు. శనివారం BSNL కంపెనీ తమ 140 ప్రాపర్టీలకు సంబంధించిన రూ.13,01,15,464 బకాయిలు ఆన్ లైన్లో చెల్లించినట్లు తెలిపారు.

Similar News

News February 16, 2026

HYD: నిరుద్యోగులకు GOOD NEWS

image

HYDలోని కేంద్రీయ విద్యాలయ 2026-27 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ వెలువడింది. పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీతో పాటు స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు (CTET) అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం పాఠశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News February 16, 2026

HYD: మార్మోగిన శివతత్వం..‘ఉత్తర-దక్షిణ’ సంగీత విందు

image

రవీంద్రభారతి వేదికగా ఆదివారం రాత్రి సంగీత ప్రియులకు శ్రవణానందం కలిగింది. సూర్మండల్ సంస్థ 15వ ‘ఉత్తర-దక్షిణ’ కచేరీని అట్టహాసంగా నిర్వహించింది. పండిత్ జయతీర్థ్ మేవుండి హిందుస్థానీ గాత్రం, విద్వాన్ శశాంక్ కర్ణాటక వేణుగానం కలిసి అద్భుతమైన జుగల్బందీని పండించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వారు ఆలపించిన ‘శంభో శివ శంభో’ కీర్తనకు సంగీత ప్రియులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.