News September 13, 2025

HYD: నేడు, రేపు MSME బిజినెస్ ఎక్స్‌పో

image

BNI హైదరాబాద్ ప్రతినిధులు అనిరుధ్ కొణిజేటి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సెప్టెంబర్ 13, 14న శంషాబాద్‌లో MSME ఎక్స్‌పో నిర్వహిస్తామని తెలిపారు. BNI ఆధ్వర్యంలో జరిగే ఈ ఎక్స్‌పోలో చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల ఉత్పత్తులు, సేవలు ప్రదర్శించబడనున్నట్లు వివరించారు. ఎక్స్‌పో విశేషాలను సీఎంకు వివరిస్తామని చెప్పారు.

Similar News

News December 9, 2025

సంగారెడ్డి: నేడు మొదటి విడత ప్రచారానికి ముగింపు

image

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు ఊరేగింపులు ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదన్నారు.

News December 9, 2025

KMR: శీతల గాలులు వీస్తున్నాయి.. జాగ్రత్త

image

కామారెడ్డి జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి మరింత తక్కువ ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. రాత్రి 7 దాటిందంటే శీతల గాలులు వీస్తూ శరీర భాగాలు మంచులా తయారవుతున్నాయి. 75% మంది ప్రజలు పట్టణంలో రాత్రి 9 నుంచి రోడ్లపై కనబడట్లేదు. గ్రామాల్లోనైతే 7గం.ల నుంచే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ప్రజలు ఉదయం, రాత్రి బయటకు రాకపోవడమే శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.

News December 9, 2025

హీరో రాజశేఖర్‌కు గాయాలు

image

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పాయి.