News July 8, 2024
HYD: నేడు వనమహోత్సవం ప్రారంభం

హైదరాబాద్‌లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నేడు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఉప్పల్ సర్కిల్-2, హబ్సిగూడ సర్కిల్- 8, రామంతాపూర్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Similar News
News December 14, 2025
RR: ఆమనగల్లు(M) శంకరకొండ సర్పంచ్‌గా రాములు

ఆమనగల్లు మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శంకరకొండ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన రాములు 101 ఓట్లతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
News December 14, 2025
SP బాలు విగ్రహానికి ‘సమైక్య’ ముద్ర

AP-TG సెంటిమెంట్‌ను విగ్రహాలు మరోసారి రాజేశాయి. SP బాలు విగ్రహాన్ని రవీంద్రభారతిలో DEC 15న CM, వెంకయ్య నాయుడు ఆవిష్కరించనున్నారు. ఈ నిర్ణయాన్ని TG వాదులు వ్యతిరేకించగా ప్రభుత్వం కళను గౌరవించే చర్యగా సమర్థించుకుంటోంది. ఇదేరోజు ట్యాంక్‌బండ్ మీద కుమురం భీం, రాణి రుద్రమ దేవి, శ్రీకృష్ణదేవరాయ, వీరేశలింగం, ఆర్థర్ కాటన్ వంటి తెలుగు మహనీయుల విగ్రహాల వార్షిక నిర్వహణకు HMDA కాంట్రాక్ట్‌ను ఖరారు చేసింది.
News December 14, 2025
RR: 81.76% పోలింగ్ నమోదు.. కౌటింగ్ షురూ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం పోలింగ్ ముగిసే వరకు 81.76 % పోలింగ్ నమోదయింది.
➦ ఆమనగల్లు మండలంలో 90.21%
➦ చేవెళ్లలో- 74.6%
➦ కడ్తాల్‌లో- 72.05%
➦ మొయినాబాద్- 84.19%
➦ షాబాద్- 80.77%
➦ శంకర్‌పల్లి- 85.97%
➦ తలకొండపల్లి- 88.38% పోలింగ్ నమోదైంది.


