News April 1, 2024

HYD: నోరూరిస్తున్న చీమ చింతకాయలు..!

image

గతంలో చీమచింత కాయలు గ్రామాల్లో విరివిగా దొరికేవి. చెట్టుకున్న చీమచింత కాయలను రాళ్లతో కొట్టి మరీ తినేవాళ్లు. నాటి తీపి జ్ఞాపకాలే వేరు. ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపించడం లేదు. కానీ HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రహదారి, ఉప్పల్ చెరువు కట్ట, ఎల్బీనగర్ ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్లపై చీమచింత కాయలు చూస్తుంటే నోరూరుతుందని, చీమ చింతకాయలు కొనుక్కొని మరీ పలువురు రుచి చూస్తున్నారు.

Similar News

News February 19, 2026

HYDలో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్..!

image

FEB 20,21,22 తేదీల్లో 3రోజులు HYDలో అగ్రి షో పేరుతో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ తెలిపారు. NTR స్టేడియంలో ఈ ప్రోగ్రాం ఉంటుందని.. 3రోజుల్లో లక్షమంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. దేశ, విదేశాల నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500కుపైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. www.rbagrishow.com.

News February 19, 2026

HYDకు ‘ప్యాకేజింగ్’ మకుటం.. 64 ఏళ్లలో ఇదే తొలిసారి..!

image

భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది. 64 ఏళ్ల చరిత్ర కలిగిన ICCA గ్లోబల్ సమ్మిట్ 2027కు ఆతిథ్యమిచ్చే అరుదైన అవకాశం మన HYDకు దక్కింది. హైటెక్స్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ ఈ విషయాన్ని గర్వంగా ప్రకటించారు. 95 శాతం రీసైకిల్ అయ్యే ఈ పర్యావరణ హిత ప్యాకేజింగ్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇదో ప్యాకేజింగ్ విప్లవం!

News February 19, 2026

సర్కార్‌కు షాక్.. GHMC 3 ముక్కలాటపై హైకోర్టు సీరియస్..!

image

HYDను 3ముక్కలు చేస్తూ సర్కార్ తెచ్చిన GOపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించినా రూల్స్‌కు విరుద్ధంగా GHMC విభజన నిర్ణయం తీసుకున్నారని గురువారెడ్డి పిల్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విభజన ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.