News August 23, 2025
HYD: పాతబస్తీలో ఏంటీ పరిస్థితి..?

HYD పాతబస్తీ ఏరియా రహదారుల్లో వాహనాలు నడపడమే కష్టంగా మారింది. ఇరుకైన గల్లీల్లో మరో సమస్య తోడైంది. వ్యర్థాలు మోతీ దర్వాజా, బకి చరోస్తా, బాతేనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నట్లు ప్రజలు తెలిపారు. చెత్తను కుక్కలు, పశువులు పీక్కుతింటున్నాయి. పాతబస్తీ ఏరియాలో శానిటేషన్ సరిగా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. వర్షాలు పడితే మరింత అధ్వానంగా మారుతోందని అంటున్నారు.
Similar News
News January 21, 2026
HYDలో భారీ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్!

ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ బుద్వేల్‌లో రూ.488crతో ప్రభుత్వం Trumpet Interchange కట్టబోతోంది. దీంతో గచ్చిబౌలి-ఎయిర్‌పోర్ట్‌కి ఈజీగా వెళ్లొచ్చు. బంజారాహిల్స్-శిల్పా Layout వరకు రూ.1,656crతో ఎలివేటెడ్ కారిడార్, మణికొండ-కోకాపేటలో రూ.110crతో పైప్‌లైన్ రోడ్డును 6 లేన్లుగా మారుస్తున్నారు. గచ్చిబౌలిలో బాటిల్‌నెక్ సమస్య తీర్చడానికి రూ.26.50crతో ORRను వెడల్పు చేయనున్నారు.
NOTE: JAN 27న టెండర్ల ఆహ్వానం.
News January 21, 2026
HYDలో ఇల్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్

ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్‌మెంట్ పర్మిషన్ కావాలన్నా ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. టౌన్ ప్లానింగ్ విభాగం March 2026 నుంచి ‘BuildNow’ అనే ఫుల్ ప్లెడ్జ్ అప్లికేషన్‌ను తెస్తోంది. ఇది మామూలు యాప్ కాదు. AIతో పనిచేసే అత్యాధునిక టెక్నాలజీ. డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో పెడితే చాలు AI టూల్స్ అన్నీ చెక్ చేసి ఇట్టే అప్రూవల్ ఇచ్చేస్తాయి. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం BuildNowకు శ్రీకారం చుట్టింది.
News January 21, 2026
HYDలో 5 లక్షలకు చేరువలో కుక్కల సంఖ్య

నగరంలో కుక్కల జనాభా బెంబేలెత్తిస్తోంది. మున్సిపాలిటీల విలీనం తర్వాత GHMC పరిధిలో వీధి కుక్కల సంఖ్య 4.86 లక్షలకు చేరుకుంది. గతంలో ఈ సంఖ్య 3.86 లక్షలుగా ఉండేది. మొత్తం కుక్కలలో 80 శాతం వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కుక్కల స్వైరవిహారం తగ్గడం లేదు. వార్డుల విలీనంతో పెరిగిన బెడద, 80 శాతం స్టెరిలైజేషన్ జరిగిందన్న మాట నిజమేనా? కామెంట్ చేయండి!


