News November 8, 2025
HYD: పార్కు కాదు.. పచ్చని డంపింగ్ యార్డు

డంపింగ్ యార్డ్ అనగానే చెత్త, చెదారంతో నిండిన దుర్వాసన గూడు గుర్తుకువస్తుంది. కానీ HYD శివారు పీర్జాదిగూడ బల్దియా పర్వతాపూర్ డంపింగ్ యార్డ్ ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేస్తోంది. చెత్త మాయమై, పచ్చదనం పరచుకుంది. పచ్చిక బయళ్లు, ఓపెన్ జిమ్‌లు అలరారుతున్నాయి. ‘ఇది డంపింగ్ యార్డా? లేక పార్కా?’ అనే అనుమానం కలిగిస్తోంది.
Similar News
News January 18, 2026
ఖమ్మం: పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ఈనెల 23, 24, 25న ఖమ్మంలో జరిగే PDSU రాష్ట్ర 23వ మహాసభల విజయవంతానికై రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు భారీగా తరలిరావాలని రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ విజ్ఞప్తి చేశారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు అప్పగించి విద్యావ్యవస్థను పూర్తిగా వ్యాపారమయం చేశారని విమర్శించారు.
News January 18, 2026
విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.


