News May 19, 2024

HYD: పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి

image

పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. ఒకే రోజు యాలాల మండలంలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. జుంటుపల్లిలో రైతులు శ్రీనివాస్, లక్మప్పలు తమ వరి పంట కోయిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో సమీప చెట్టు కిందకి వెళ్లారు. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బెన్నూరులో సైతం రైతు గొల్ల వెంకన్న వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి మృతి చెందాడు.

Similar News

News December 13, 2024

HYD: అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఈ డెయిరీ పాలే: గుత్తా

image

అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు విజయ డెయిరీ పాల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని విజయ తెలంగాణ డెయిరీ ఛైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ సంచాలన్‌ భవన్‌లో నూతనంగా తెలంగాణ విజయపార్లర్‌ను గురువారం ప్రారంభించారు. విజయ తెలంగాణ డెయిరీ గత ఆరు దశాబ్దాల నుంచి రైల్వేతో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందన్నారు.

News December 13, 2024

HYD: పండుగలా నిర్వహించండి: కలెక్టర్‌

image

సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్‌ ఛార్జిల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం డైట్, కాస్మోటిక్‌ ఛార్జీలు 40% పెంపు ప్రారంభోత్స ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు, ఆర్డీవోలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

News December 13, 2024

ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లకు భద్రత కల్పించండి

image

మరణించిన ఆటోడ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డ్రైవర్లకు సామాజిక భద్రత బీమా పథకం రెన్యువల్‌తోపాటు, వారి కుటుంబాలకు అందించే రూ.5 లక్షలను రూ.10 లక్షలకు పెంచాలని INTUC నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. గురువారం మంత్రిని కలిసి ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. అలాగే ప్రమాదంలో అంగవైకల్యం చెందిన డ్రైవర్లకు రూ.3 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాలని మంత్రిని కోరారు.