News August 22, 2025

HYD: పిల్లల్లో అత్యధికంగా డయేరియా కేసులు

image

నగరంలో గత 6 నెలల్లో దాదాపు 6 వేలకుపైగా డయేరియా, 724పైగా టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో డయేరియాకు సంబంధించి ఎక్కువ శాతం పిల్లలే ఉంటున్నారు. బస్తీలు, మురికివాడలో భారీగా కేసులు నమోదు అవుతున్నట్లు జిల్లా వైద్య అధికారుల బృందం తెలిపింది. పిల్లల వ్యక్తిగత శుభ్రత పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మంచినీళ్లు, ఆహారం తీసుకునేముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుకున్నేలా వారికి అవగాహన కల్పించాలి.

Similar News

News January 20, 2026

పెద్దపల్లి: ట్రాన్స్ జెండర్లకు ఉపాధి యూనిట్లు

image

పెద్దపల్లి జిల్లాలో గల ట్రాన్స్ జెండర్లకు ఉపాధి హామీ పథకం కింద రెండు యూనిట్లు అందజేశారు. అదనపు కలెక్టర్ దాసరి వేణు (రెవెన్యూ) ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు రూ.1.50లక్షల లోన్స్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాలరావు, సూపర్డెంట్ రాజయ్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు.

News January 19, 2026

SRCL: ‘మహిళల ఆర్థిక ప్రగతితో దేశ రాష్ట్ర ప్రగతి సాధ్యం’

image

మహిళల ఆర్థిక ప్రగతితో దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమనే ఉద్దేశ్యంతో ప్రతి ప్రభుత్వ పథకంలో వారిని భాగస్వామ్యులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని, స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

News January 19, 2026

రేపు ఆటోల బంద్.. క్లారిటీ

image

TG: రాష్ట్రంలో మంగళవారం ఆటోల బంద్‌ లేదని స్టేట్ టాక్సీ & ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెంటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.12 వేల ప్రోత్సాహకాన్ని వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలనే డిమాండ్‌తో త్వరలోనే ఉద్యమం చేపడతామన్నారు. ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు.