News August 23, 2025

HYD: పీజీ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యుల్ విడుదల

image

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యుల్‌ను విడుదల చేశారు. MSc బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మషుటికల్ కెమిస్ట్రీ, ఎంఏ ఎకనామిక్స్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగేట్- 2025 అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కన్వినర్ ప్రొ.పాండురంగారెడ్డి తెలిపారు. వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.

Similar News

News January 12, 2026

సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

image

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.

News January 12, 2026

NGKL: సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలి: ఎంపీ

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ డా. మల్లు రవి అధికారులకు సూచించారు. గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ నిర్వహించి హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 251 ఫిర్యాదులకు గానూ 176 కేసుల్లో ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయని కలెక్టర్ వివరించారు. నిబంధనల ప్రకారం బాధితులకు తక్షణ పరిహారం అందజేయాలని ఎంపీ ఆదేశించారు.

News January 12, 2026

ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ఆర్సీబీ ముందు యూపీ వారియర్స్ 144 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. RCB బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యూపీ ఓపెనర్లు లానింగ్(14), హర్లీన్(11) పరుగులు రాబట్టేందుకు తడబడ్డారు. లిచ్‌ఫీల్డ్(20), కిరణ్(5) విఫలమవ్వగా ఆల్‌రౌండర్లు దీప్తి(45*), డాటిన్(40*) ఆరో వికెట్‌కు 93 పరుగులు జోడించడంతో UP 20 ఓవర్లలో 143/5 స్కోరు చేసింది. RCB బౌలర్లలో నాడిన్, శ్రేయాంక చెరో 2, లారెన్ ఒక వికెట్ తీశారు.