News November 19, 2025

HYD: పూజిత చనిపోయింది.. పోలీసుల ప్రకటన

image

HYD ఘట్‌కేసర్ పరిధి అవుషాపూర్‌లోని <<18219517>>అనురాగ్ యూనివర్సిటీలో<<>> BSC నర్సింగ్ 3rd ఇయర్ చదువుతున్న పూజిత(22) ఈనెల 6న కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలైన ఆమె పంజాగుట్ట నిమ్స్‌‌లో 13 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయిందని ఘట్‌కేసర్ పోలీసులు ఈరోజు తెలిపారు. కాగా పూజిత స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మలవాడ అని చెప్పారు.

Similar News

News January 15, 2026

దేశ భద్రత విషయంలో ముందుంటాం: CM

image

TGలో మరో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆర్మీ అధికారులను CM రేవంత్ కోరారు. పదేళ్లుగా ఒక్క స్కూలును కూడా మంజూరు చేయలేదన్నారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని HYDకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశ భద్రత అంశాల్లో సహకరించడంలో TG సర్కార్ ముందుంటుందని, లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్‌కు VKDలో 3వేల ఎకరాలు కేటాయించినట్లు HYDలో జరిగిన సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్‌లో గుర్తుచేశారు.

News January 15, 2026

MBNR: ఓపెన్ SSC, INTER.. రేపే లాస్ట్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓపెన్ SSC, INTERలో చేరిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీ చెల్లించాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ (TOSS) కో-ఆర్డినేటర్ శివయ్య “Way2News” ప్రతినిధితో తెలిపారు. ఈ నెల 16లోగా (ఫైన్‌తో) ఎగ్జామ్ ఫీ ఆన్లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు www.telanganaopenschool.org వెబ్ సైట్‌లో సందర్శించాలన్నారు.
#SHARE IT

News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.