News August 21, 2025
HYD: పెళ్లికాని ప్రసాదులు? జర జాగ్రత్త!

సింగల్‌గా ఉన్నారా? జర జాగ్రత్త! పెళ్లికాని ప్రసాదులు ఆకర్షణ బుట్టలో ఇట్టే పడిపోతున్నారు. డేటింగ్ యాప్స్, వాట్సప్, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో పరిచయం అవుతున్న యువతులు రాత్రి న్యూడ్ కాల్ చేస్తామని చెప్పి రూ.500 నుంచి రూ.2,000 వసూలు చేస్తున్నారు. సింగిల్స్ వీక్నెస్‌ను క్యాష్ చేసుకుని 10 MIN కాల్స్‌తో రూ.వేలల్లో లాగేస్తున్నారు. హోటల్ గదులు బుక్ చేస్తామని చెప్పి, డబ్బులు తీసుకున్నాక హ్యాండ్ ఇస్తున్నారు.
Similar News
News January 16, 2026
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి కాలేదు: సీఎం

TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావాల్సినంత అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో అభివృద్ధి చెంది ఉండేది. పాలమూరు జిల్లాతో పాటు సమానంగా నిధులు ఇస్తా. నిర్మల్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, కొత్త స్టేడియం మంజూరు చేస్తాం’ అని నిర్మల్ సభలో ప్రకటించారు.
News January 16, 2026
పాలమూరు: ‘KCR హయాంలో ప్రాజెక్ట్‌లు నిర్లక్ష్యం’

మాజీ సీఎం KCR పాలనలో తెలంగాణలోని ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్మల్ బహిరంగ సభలో విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న సాగునీటి ప్రాజెక్ట్‌లను గాలికి వదిలేశారన్నారు. గోండు గూడెంలలో ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు.
News January 16, 2026
నిజామాబాద్ ఫస్ట్.. నల్గొండ సెకండ్

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. 5.23 లక్షల టన్నులతో జిల్లా రెండో స్థానంలో ఉండగా, 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ మొదటి స్థానంలో ఉంది. పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసి రైతులకు వారంలోగా నగదును బ్యాంకు ఖాతాలో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపలేదు.


