News April 11, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని అత్యాచారం

image

యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని కాచిగూడ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలిచారు. SI సుభాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాకలో నివాసం ఉంటున్న యువతి (29) ప్రైవేటు ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. సత్యానగర్‌ వాసి అఖిల్ (30)‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు ముఖం చాటేయడంతో‌ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Similar News

News December 17, 2025

HYD: దమ్ బిర్యానీ పక్కదారి!

image

వైరల్ రీచ్ కోసం యువ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అసలైన ‘దమ్ బిర్యానీ’ రుచిని పక్కన పెట్టి కేవలం ఫొటోలకు పనికొచ్చే ఫ్యాన్సీ ప్లేటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో పాత తరపు ఘాటైన రుచికి, కొత్త తరఫు ఇన్‌స్టా-కేఫ్‌ల మెరుపులకు మధ్య యుద్ధమే నడుస్తోంది. ఏది ‘రుచి రాజసం’? ఏది ‘లైకుల మోసం’? అని బిర్యానీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు. మరి ‘బిర్యానీ దమ్’ చచ్చిందా? ‘రీల్స్ ట్రెండ్’ గెలిచిందా? కామెంట్ చేయండి.

News December 17, 2025

HYDను UTగా మార్చే కుట్ర: మాజీ మేయర్

image

అన్నీ వసతులున్న HYDను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. GHMC విస్తరణ పేరుతో తెలంగాణను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని ఘాటుగా స్పందించారు. HYDను దేశానికి 2వ రాజధానిగా మార్చేందుకు మోదీ, చంద్రబాబు, రేవంత్‌తో యత్నాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.