News November 20, 2025

HYD: పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్

image

స్థానిక సంస్థల ఎన్నికల ముందే పోలీస్ శాఖలోని 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధి ఆకాశ్ డిమాండ్ చేశారు. ఈరోజు సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను విస్మరించిందన్నారు. జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, స్థానిక సంస్థల ఎన్నికలలోపు JOB నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు.

Similar News

News January 18, 2026

VZM: కలెక్టరేట్‌లో రేపు PGRS కార్యక్రమం

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్‌లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 18, 2026

నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పిస్తాం: CM

image

TG: నర్సింగ్ కోర్సు చేసిన వారికి జపాన్, జర్మనీలో మంచి డిమాండ్ ఉందని CM రేవంత్ అన్నారు. విద్యార్థులకు నర్సింగ్ కోర్సుతో పాటు జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్‌కి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. JNTU కళాశాల, మద్దులపల్లి మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు.

News January 18, 2026

హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in