News August 13, 2025
HYD: పోలీస్ కమిషనర్లకు సీఎం కీలక సూచనలు

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇక అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఎప్పటికప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలను మీడియాలో వచ్చేలా చూడాలని సూచించారు.
Similar News
News March 12, 2026
గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కడప ఎస్పీ

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
News March 12, 2026
వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!

TG: వాట్సాప్ ద్వారా పలు రకాల వైద్య సేవలు అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఓపీ రిజిస్ట్రేషన్, హెల్త్ కార్డుల డౌన్‌లోడ్ వంటి సేవలను అందించనుంది. ప్రభుత్వ తేనున్న ప్రత్యేక నంబర్‌కు HI అని మెసేజ్ చేసి, ఆయుష్మాన్ భారత్ ID, ఆధార్‌తో వెరిఫై చేసుకోవాలి. ఆస్పత్రిని సెలక్ట్ చేసుకుని సేవలు పొందవచ్చు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చి ఫిర్యాదులూ చేయవచ్చు. తొలుత 1000 ఆస్పత్రులలో అందుబాటులోకి తేనున్నారు.
News March 12, 2026
ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు: మంత్రి రాజనర్సింహ

మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘వుమెన్ వెల్నెస్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. మహిళలందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


