News November 20, 2025
HYD: ‘ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పని చేయాలి’

HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ & సోషల్ మీడియా విభాగాల సంయుక్త సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు. లీగల్ మార్గదర్శకాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయడం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News January 23, 2026
HYD: CNG కావాలంటే క్యూ కట్టాల్సిందే!

వారం రోజులుగా సిటీలో CNG గ్యాస్ దొరకడం లేదని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్దనున్న పెట్రోల్ బంక్‌లో గత 3-4 గంటల నుంచి క్యూ కట్టారు. ఇతర బంకుల్లోనూ CNG కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. CNG నింపుకోవడానికి దినం గడిచిపోతుందని.. బిజినెస్ ఎప్పుడు చేసుకోవాలని వాపోతున్నారు. సమస్య తీర్చాలంటున్నారు.
News January 23, 2026
చర్లపల్లి నుంచి కేరళకు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

HYD ప్రయాణికులకు గుడ్‌న్యూస్. చర్లపల్లి నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు సరికొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కింది. కేరళలో ప్రధాని మోదీ ఈ రైలుకు పచ్చజెండా ఊపారు. తక్కువ ఛార్జీతోనే విమానం రేంజ్ సౌకర్యాలు, కుదుపులు లేని ప్రయాణం సామాన్యుడికి సొంతం కానుంది. ప్రతి మంగళవారం చర్లపల్లిలో 7.15 AMకి, ప్రతి గురువారం 11.30 PMకి తిరువనంతపురంలో స్టార్ట్ అవుతుంది.
SHARE IT
News January 23, 2026
రిపబ్లిక్ డే అలర్ట్: సికింద్రాబాద్ గగనతలంపై ‘నో ఫ్లై’ జోన్!

JAN 26న పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ భద్రతను పెంచుతున్నారు పోలీసులు. జనవరి 26న ఆకాశంలో డ్రోన్లు ఎగిరేస్తే ఇక కటకటాలే. బేగంపేట, మార్కెట్, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డ్రోన్లు, పారా-గ్లైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ పూర్తి నిషేధం విధించారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


