News November 20, 2025

HYD: ‘ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పని చేయాలి’

image

HYD నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ & సోషల్ మీడియా విభాగాల సంయుక్త సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొని మాట్లాడారు. లీగల్ మార్గదర్శకాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం చేరవేయడం వంటి అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

Similar News

News January 23, 2026

OFFICIAL: WHO నుంచి వైదొలగిన అమెరికా

image

WHOతో అమెరికా తన అనుబంధాన్ని తెంచుకుంది. 2026 జనవరి 22న సంస్థ నుంచి అధికారికంగా వైదొలగింది. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే దీనిపై సంతకం చేశారు. కరోనా సమయంలో WHO సరిగ్గా స్పందించలేదని, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఇకపై ఆరోగ్య విషయాల్లో నేరుగా ఇతర దేశాలతోనే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేసింది.

News January 23, 2026

‘నైనీ’ బ్లాకులపై కేంద్ర బృందానికి సింగరేణి CMD నివేదిక

image

TG: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం హైదరాబాద్‌లో సింగరేణి CMD కృష్ణ భాస్కర్, ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. నైనీ బొగ్గు బ్లాకు టెండర్ ప్రక్రియ వివరాలను CMD ఆ బృందానికి సమర్పించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద వినియోగించిన నిధుల వివరాలనూ అందించాలని బృందం సభ్యులు అధికారులను కోరారు. రెండేళ్లుగా ప్రభుత్వం ‘రాజీవ్ అభయ హస్తం’ పథకానికి ఈ CSR నిధులనే వినియోగిస్తోంది.

News January 23, 2026

కల్లూరు: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి

image

కల్లూరు మండలం లింగాల గ్రామ సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఇంకా ప్రారంభం కాని ఈ రహదారిపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.